కేదారేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు
కాకినాడ రూరల్ ఇంద్రపాలెం శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి దర్శనానికి సినీ నటుడు గౌతమ్ రాజు దంపతులు హాజరయ్యారు. దర్శనానంతరం గౌతమ్ రాజు దంపతులచే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం శివుడికి ఎంతో ప్రీతికరమైందని పేర్కొన్నారు.