VIDEO: 'వెంటనే పైపు లైన్ మరమ్మత్తు చేపట్టాలి'
WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభనగర్‌లో మిషన్ భగీరథ పైపు కొన్ని సంవత్సరాలుగా పగిలి వేల లీటర్ల నీరు వృథా అవుతోంది. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపు పగిలిన గుంతను మూయడానికి స్పీడ్ బ్రేకర్ వేయడంతో ఆ స్థలం ప్రమాదకరంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి పైపు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.