అభ్యంతరాలు తెలుపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి
HYD: జీహెచ్ఎంసీ డివిజన్‌ల పునర్విభజనపై అభ్యంతరం తెలుపుతూ మేయర్, కమిషనర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ డివిజన్లను పునర్విభజన చేశాక పాత డివిజన్ల కంటే సంఖ్య తగ్గిందని, డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి అభ్యంతరాలు తెలుపుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.