చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేసిన సీఐ
BDK: ఎన్నికల నియమావళిని ప్రతి పార్టీ కార్యకర్త, అభ్యర్థి తప్పక పాటించాలని సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ఆయన, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. రూ. 50వేలలకు మించి నగదును ఆధారాలు లేకుండా తరలిస్తేసీజ్ చేయాలని సూచించారు