4 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ

4 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 8న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 4 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. ఆ రైళ్లు బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్-ఢిల్లీ సహా ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఈనెల 8న ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని ఈ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.