జీహెచ్ఎంసీ వార్డులపై ఫిర్యాదుల ‘సునామీ’
HYD: GHMC పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాల పర్వం మొదలైంది. 300 వార్డులుగా డీలిమిటేషన్ చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ అవగా దీనిపై నిరసన గళం వినిపిస్తోంది. ప్రోఫార్మా-III ద్వారా అందిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10న ఏకంగా 40ఫిర్యాదులు నమోదయ్యాయి. ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న వార్డుల సరిహద్దులు, జనాభా లెక్కలపై రాజకీయ పక్షాలు విమర్శలున్నాయి.