'హైవే నిర్మాణ బాధితులకు న్యాయం'
ASR: జీ.మాడుగుల మండలం కులుపాడు, బలమానుసంక, వరెగులపాలం గ్రామాల్లో గురువారం తహసీల్దార్ రాజ్ కుమార్‌తో కలిసి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు పర్యటించారు. 516-ఈ హైవే నిర్మాణంలో భూమి, ఇళ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హైవే నిర్మాణ బాధితుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కలిగించ వద్దని కోరారు.