వణికిస్తున్న చలి.. ప్రజల ఇబ్బందులు

వణికిస్తున్న చలి.. ప్రజల ఇబ్బందులు

NZB: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పాలు, కూరగాయల విక్రయదారులు, పారిశుధ్య కార్మికులు, రైతులు చలితో వణికిపోతున్నారు. దీంతో కూలీలు, కార్మికులు పనిస్థలాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. వాకింగ్ చేసేవారు సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.