ముడుచింతలపల్లి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ BRSకే..!
MDCL: మూడుచింతలపల్లి పురపోరులో ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డుల్లో 14 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా, కాంగ్రెస్- 9, బీజేపీ- 1 వార్డు సాధించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ మున్సిపాలిటీలో BRS జెండా ఎగరవేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.