తామరపల్లిలో ప్రత్యేక ఉపాధి హామీ గ్రామసభ
ASR: రంపచోడవరం మండలం తామరపల్లి సచివాలయంలో ప్రత్యేక ఉపాధి హామీ గ్రామసభను సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీ వంశి కుంజం మాట్లాడుతూ.. పంచాయతీలో మరణించిన 98 మందితో పాటు వివాహం అయిన వారి పేర్లు జాబ్ కార్డుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారు నూతన జాబ్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.