పులి సంచారం కలకలం.. భయాందోళనల్లో రైతులు

పులి సంచారం కలకలం.. భయాందోళనల్లో రైతులు

ASF: రెబ్బెన మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం గోలేటి పరిధిలోని సోనాపూర్, అబ్బాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో పులి అడుగులను శనివారం స్థానిక రైతులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి పులి అడుగులను నిర్థారించాలని రైతులు కోరుతున్నారు. పులి సంచారిస్తున్నట్లు భావించి పరిసర ప్రాంతాల రైతులు, రైతు కూలీలు భయంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.