రేపు క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

రేపు క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

SRPT: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలలో 2025-26 ఏడాదికి గాను నాలుగవ తరగతి ప్రవేశానికి విద్యార్థినీ, విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. హుజూర్ నగర్ లో గురువారం ఉదయం 10 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు MEO సైదా నాయక్ తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు ఈనెల 23 నుంచి 26 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.