VIDEO: 9 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్

VIDEO: 9 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్

SKLM: టెక్కలిలో సోమవారం 9 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టెక్కలి సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం గునుపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 9.255 కేజీల గంజాయితో రైలులో టెక్కలి వచ్చి అక్కడ నుండి విశాఖ వెళ్లేందుకు వచ్చిన క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.