కాంట్రాక్టు కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలి

SRD: కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చౌటకూర్ మండలం శివంపేట పరిధిలోని సీపీఎం పరిశ్రమలు కార్మికులతో బుధవారం సర్వే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.