PGRSలో 441 అర్జీలు స్వీకరణ: కలెక్టర్

కాకినాడ PGRS కార్యక్రమానికి వివిధ అంశాలపై 441 అర్జీలు అందినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి హాజరై, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.