రైతులకు త్వరితగతిన నష్టపరిహారం చెల్లిస్తాం: జేసీ
SKLM: ఆమదాలవలస ఊసావాని పేట రైల్వే గేట్ వద్ద ప్రతిపాదిత రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు నష్టపరిహారం చెల్లింపులపై అవసరమైన తదుపరి చర్యలు త్వరితగతిన తీసుకుంటామని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.