'ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి'

'ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి'

AKP: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు సుశాంత్ మిశ్రా పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలపై ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.