కనిగిరిలో డ్రోన్ ఎగరవేసిన అధికారులు

కనిగిరిలో డ్రోన్ ఎగరవేసిన అధికారులు

ప్రకాశం: కనిగిరి పట్టణంలో నిర్మానుష్య ప్రదేశాలలో పోలీసులు శనివారం డ్రోన్ ఎగరవేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారముండే ప్రాంతాలను డ్రోన్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.