వెంకటాపూర్ ఎంపీవోగా గడ్డల శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు

MLG: వెంకటాపూర్ మండల పరిషత్ అధికారి (ఎంపీవో)గా నల్లగుంట పంచాయతీ సెక్రెటరీ గడ్డల శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం మంగపేట ఎంపీవో వెంకటాపూర్ ఎంపీవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.