అయిజలో యూరియా కొరత .. రైతుల ఆందోళన

GDWL: అయిజ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేవలం 300 బస్తాల యూరియా మాత్రమే మార్క్‌ఫెడ్ నుంచి సరఫరా కావడంతో సింగిల్ విండో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని. ఈ సీజన్‌లో వరి మరియు ఇతర పంటలకు యూరియా అత్యవసరమని అయనా పేర్కొన్నారు.