నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు
కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపాలిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వికాసా ద్వారా పనిచేస్తున్న 77 మంది కార్మికులను మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తొలగించడానికి నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.