పోలీసులు మీకోసం కార్యక్రమంలో డీఎస్పీ

ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ నంబర్స్, దొంగల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.