వినాయకుడికి 108 ప్రసాదాల నైవేద్యం

KNR: నగరంలోని 21వ డివిజన్ సీతారాంపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ లో గౌడ్ హాస్టల్ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా గురువారం రాత్రి వినాయకుడికి ముందుగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం మహిళలు వివిధ రకాల తయారు చేసిన 108 ప్రసాదాల నైవేద్యంగా సమర్పించారు.