'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు కలిసి ఘనపూర్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు.