ప్రమాద స్థలాలను పరిశీలించిన డీఎస్పీ

VZM: బొండపల్లి మండలంలోని జాతీయ రహదారిపై గల ప్రమాద స్థలాలను బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి బుధవారం పరిశీలించారు. మండలంలోని అంబటి వలస, గొట్లాం, బోడసింగిపేట గ్రామాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలో సిబ్బందికి సూచించారు. ఇందులో గజపతినగరం సీఐ జిఏవి రమణ, బొండపల్లి ఎస్సై మహేష్ పాల్గొన్నారు.