అనర్హతా పెన్షన్లు తొలగిస్తాం: మంత్రి

అనర్హతా పెన్షన్లు తొలగిస్తాం: మంత్రి

ప్రకాశం: రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ల తొలగింపుపై వస్తున్న విమర్శలపై శనివారం మంత్రి స్వామి స్పందించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి ఈ విషయంపై మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను మానుకోవాలని, అనర్హులను తొలగించడమే తమ ఉద్దేశం అన్నారు. కాగా, అర్హులై ఉండి పెన్షన్ తొలగింపుకు గురైన వారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అప్పీలుకు అవకాశం కల్పించిందన్నారు.