24న జిల్లా స్థాయి క్రీడా పోటీలు
SKLM: ఈనెల 24వ తేదీన నగరంలోని కేఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి 'శాప్ లీగ్ మాస్టర్స్ (వెటరన్స్) క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 ఏళ్లు 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్‌లోని వివిధ విభాగాల్లో (రన్నింగ్,జంప్స్, త్రోస్) ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.