భారత క్రికెట్ చరిత్రలో అద్భుత ఘట్టం: లోకేష్
AP: టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో భారత క్రికెట్ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని మంత్రి లోకేష్ అన్నారు. టీమిండియా గెలుపులో స్టార్ బ్యాటర్లు సంజు, అభిషేక కీలక పాత్ర పోషించారన్నారు. వారి అద్భుత ప్రదర్శనతో జట్టుకు బలమైన పునాది వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్‌కు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో దేశం మొత్తం గర్వపడుతోందని తెలిపారు.