బీఆర్ఎస్‌లో వర్గపోరు మొదలైంది: మంత్రి అడ్లూరి
TG: బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల సభలో కేసీఆర్, కేటీఆర్ ప్రకటించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందని మంత్రి జోస్యం చెప్పారు. ఢిల్లీలో హరీష్ రావు ఎవరిని కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.