మాజీ సర్పంచ్ కన్నుమూత

మాజీ సర్పంచ్ కన్నుమూత

బాపట్ల: కొరిశపాడు మండలం పమిడిపాడు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ ఛైర్మన్‌ కేసరి వెంకటరెడ్డి సోమవారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందాడు. సర్పంచ్‌గా, సొసైటీ ఛైర్మన్‌గా ప్రజలకు విశేష సేవలు అందించారు. స్వగ్రామం రెడ్డిపాలెంలో బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలియజేశారు.