VIDEO: దారుణం.. గెలిచిన అభ్యర్థిపై కత్తితో దాడి
కొమరంభీం జిల్లాలో దారుణం జరిగింది. సిర్పూర్(టి) మండలం ఇటుకల పహాడ్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మద్దతురాలు వడైహి తానుబాయ్ భర్త పోశెట్టిపై ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి నారాబాయ్ భర్త భీం రావు కత్తితో దాడికి యత్నించారు. ఈ దాడిని గ్రామస్థులు ప్రతిఘటించి, భీం రావును చెట్టుకు కట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.