రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలి

రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలి

సూర్యాపేట: రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ అన్నారు. మఠంపల్లి మండలంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ చేసి రైతన్న ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.