రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
SRD: పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పోచారం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించి, 13 మందితో రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూప్ రూపొందించారు.