పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: పోలవరం జిల్లాలోని ఉయ్యాలమడుగు, లక్కొండ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. వేములోవ నుంచి రాత్రి ప్రయాణించి పులి లక్కొండకు చేరుకున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం DFO శివకుమార్, SDFO సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అటవీ బృందాలు పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. పులి సంచారంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.