తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కృష్ణా: తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన పెడన మండలం పెనుమల్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వల్లభు ఏడుకొండలు (56) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారులు లేకపోవటంతో తలకొరివి ఎవరు పెడతారన్నది బంధు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మూడో కుమార్తె కల్యాణి ముందుకొచ్చి.. తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు.