విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచేలా కృషి చేయాలి: డీఈవో

విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచేలా కృషి చేయాలి: డీఈవో

NRPT: విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆర్జెడి విజయలక్ష్మీ అన్నారు. నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న నూతన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం ఎంతో గౌరవప్రదం అన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఆమె సూచించారు.