'వైసీపీ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైంది'

SKLM: బీసీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ, శిక్షణ పేరుతో దాదాపు రూ.150 కోట్ల భారీ మోసానికి కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం ఆరోపించారు. వైసీపీ హయాంలోనే నిజమైన మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. గతంలోనూ ‘ఆదరణ’ పథకం కింద కుట్టుమిషన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆమె గుర్తు చేశారు.