జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు

జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు

AP: జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు CM చంద్రబాబు అంగీకరించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోనసీమ అంబాజీపేట మండలం మొసలపల్లిలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రభల తీర్థానికి 450 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. చంద్రబాబును ఒప్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృషి చేశారని చెప్పారు.