'చపాట మిర్చి పరిశోధన పనులు ప్రారంభించాలి'
WGL: నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట శివారులో చపాట మిర్చి పరిశోధన కేంద్రం కోసం గత ప్రభుత్వం భూమి కేటాయించి శిలాఫలకం వేసినా, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని కోరారు.