గోరుకల్లు జలాశయం నుంచి నీరు విడుదల

KRNL: గోరుకల్లు జలాశయం నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వలకు ఆదివారం నీటి ప్రవాహం కొనసాగింది. గత నెల 30న గాలేరుకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 13,500 క్యూసెక్కుల నీటిని గాలేరుకు పంపిస్తున్నారు, దీనిని 5,000 క్యూసెక్కుల నుంచి క్రమంగా పెంచారు. గోరుకల్లు జలాశయంలో 7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, ఎస్సార్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.