ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.