శాంతిభద్రత సమస్యలకు సహకరించాలి: ఎస్సై
కోనసీమ: శాంతిభద్రతల సమస్యలకు సహకరించాలని అయినవిల్లి ఎస్సై జ్యోతి కోరారు. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో శనివారం ఆమె శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవల ఓఎన్జీసీ కార్యకలాపాలను గ్రామస్తులను అడ్డుకున్న నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఓఎన్జీసీ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.