పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన గ్రామస్థులు
ASF: సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో శ్రమతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులను ఆదివారం గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రతను కాపాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని నాయకులు ప్రశంసించారు.