కల్లు సీసాలో ఎలుక కలకలం
NRPT: కల్లు తాగేందుకు వెళ్లిన ఓ మహిళకి ఊహించని ఘటన ఎదురైంది. తాను తీసుకున్న కల్లు సీసాలో చనిపోయిన ఎలుక కనిపించడంతో షాక్కు గురై ఆందోళన చెందింది. కోస్గి మండలం నాగుసాన్పల్లిలో ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాలమణి బుధవారం దుకాణంలో కల్లు కొనుగోలు చేసి, అక్కడే తాగేందుకు ప్రయత్నించగా సీసాల నుంచి కల్లు బయటకు రాలేదు. ఆమె గమనించి చూడగా ఎలుక కనబడింది.