తిరుమలలో చోరీ.. ఖండించిన టీటీడీ

తిరుమలలో చోరీ.. ఖండించిన టీటీడీ

AP: శ్రీవారి పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగిందనే వార్త అసత్యమని TTD తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది జనవరి 11న పరకామణిలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నట్లు చెప్పింది. ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపింది.