నేడు గంట్యాడలో పర్యటించనున్న మంత్రి
VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఉదయం 9 గంటలకు గంట్యాడ మండలం రావువలస అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్వహించు రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే మధ్యహ్నం 3 గంటలకు గజపతినగరం మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.