బళ్లారి రోడ్ వద్ద రచ్చబండ కార్యక్రమం
ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ YCP చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం టౌన్, బళ్లారి రోడ్ వద్ద రచ్చబండ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి హాజరై సంతకాలు సేకరించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిల్ప, ఇతర నాయకులు పాల్గొన్నారు.