గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో జలకళ: తెలంగాణ ప్రభుత్వం

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా.. మేడిగడ్డ ఆనకట్ట కుంగినా, అన్నారం, సుందిళ్లలో నీటిని ఆపకున్నా వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వలతోపాటు మిడ్ మానేరు, ఎల్‌ఎండీలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని తెలిపింది.