'రైతులు నానో యూరియాపై దృష్టి సారించాలి'

'రైతులు నానో యూరియాపై దృష్టి సారించాలి'

MDK: నానో యూరియా వాడడం వల్ల నైట్రోజన్ వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, పంటల వృద్ధి అధిక దిగుబడి నాణ్యత మెరుగవుతుందని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి దీపిక సూచించారు. నర్సాపూర్ లోని పలు ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం వేచి ఉన్న రైతులకు ఆమె అవగాహన కల్పించారు. నానో యూరియా వల్ల మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుతుందని తెలిపారు.