దళారులను నమ్మొద్దు: అదనపు కలెక్టర్
WNP: రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలుకేంద్రాలలోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొత్తకోట మండలం కానాయిపల్లిలో వరి కొనుగోలుకేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలుచేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.